Gentleman 2: ‘జెంటిల్ మెన్2’లో నయనతారతో పాటు మరో హీరోయిన్..నిర్మాత అధికారిక ప్రకటన

-

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ ఫస్ట్ పిక్చర్ ‘జెంటిల్ మెన్’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1993లో విడుదలైన ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కుంజుమోన్. కాగా, ఆ సినిమాకు సీక్వెల్ తీయాలని ఆయన చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. 2020లో సీక్వెల్ తీయబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే సీక్వెల్ పైన భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

‘జెంటిల్ మెన్’ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా అర్జున్, మధుబాల హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ ఎవర్ గ్రీన్ ఫిల్మ్ కు సీక్వెల్ అంటున్న క్రమంలో ఆడియన్స్ నుంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఏర్పడుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అన్నట్లు వారు వెయిట్ చేస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ కుంజుమోన్ సీక్వెల్ మూవీని పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు.

సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా మలయాళ ముద్దుగుమ్మ నయనతార చక్రవర్తిని గతంలో ప్రకటించిన ప్రొడ్యూసర్ కుంజుమోన్..బుధవారం మరో హీరోయిన్ పేరు ప్రకటించారు. ప్రియాలాల్ మరో హీరోయిన్ గా నటించనుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ మేరకు ఆమెతో దిగిన ఫొటో షేర్ చేశారు.

ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, దర్శకులు ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలో దర్శకుడు ఎవరనేది మేకర్స్ ప్రకటించనున్నారు. అయితే, సీక్వెల్ ను కూడా శంకరే డైరెక్ట్ చేయాలని సినీ అభిమానులు కోరుతున్నారు. కానీ, శంకర్ ప్రజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RC15 ఫిల్మ్ ను డైరెక్ట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version