కేసీఆర్ వ‌రి కొనుగోలు డ్రామా అట్ట‌ర్ ప్లాప్ : డీకే అరుణ‌

-

తెలంగాణ‌లో వ‌రి ధాన్యాన్ని తామే కొనుగోలు చేస్తామ‌ని సీఎం కేసీఆర్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌ట‌న చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్ర‌క‌ట‌నపై ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజా గా బీజేపీ జాతీయ ఉపాధ్య‌యురాలు డీకే అరుణ స్పందించారు. కేసీఆర్ వరి కొనుగోలుపై ఆడిన డ్రామా అట్టర్ ప్లాప్ అయిందని విమ‌ర్శించారు. రైతులను వరి వేయ‌వద్దని.. వరి వేస్తే ఉరి అని సీఎం కేసీఆర్ నాటకాలాడాడు మండిప‌డ్డారు.

కాగ కేంద్ర ప్ర‌భుత్వం ఉప్పుడు బియ్యం మాత్ర‌మే వ‌ద్ద‌ని చెప్పింద‌ని అన్నారు. కానీ కేసీఆర్ దీన్ని స‌మ‌స్య‌గా త‌యారు చేశార‌ని విమ‌ర్శించారు. ప్ర‌స్తుతం ఉప్పుడు బియ్యం ఏ రాష్ట్రంలో పండిస్తుందో ఆ రాష్ట్రానికి సరిపోతోన్నాయ‌ని అన్నారు. అలాగే సీఎం కేసీఆర్ ఢిల్లీలో చేసిన దీక్ష పై కూడా డీకే అరుణ విమ‌ర్శ‌లు చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ దీక్షలో రైతులే లేర‌ని ఎద్దేవ చేశారు. టీఆర్ఎస్ నాయకులే టూర్ వెళ్లిన‌ట్టు వెళ్లార‌ని విమ‌ర్శించారు. ఢిల్లీలో ధర్నా అట్టర్ ప్లాప్ అని అన్నారు. రాష్ట్రంలో తక్షణమే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version