ఈ మధ్య చాలా మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతున్నారు. ఇలా స్కీముల్లో డబ్బులని పెడితే చక్కటి లాభాలని పొందవచ్చు. దేశంలో రకరకాల ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లు వున్నాయి. ఈ మధ్య ఎక్కువ మంది పోస్టాఫీసుల్లో కూడా డబ్బులు పెడుతున్నారు. పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్ లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే చక్కటి లాభాలని పొందవచ్చు. అధిక మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారికి ఇది మంచి స్కీమ్.
ఈ స్కీమ్ పరిమితిని కూడా పెంచింది. గతంలో రూ.4.5 లక్షల లిమిట్ ఉండేది. దానిని రూ.9 లక్షల కి చేసారు. ఒకవేళ జాయింట్ అకౌంట్ అయితే రూ.15 లక్షల వరకు పెట్టచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ సమయం వచ్చేసి ఐదేళ్లు. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. పూర్తి సురక్షితమే. ఈ స్కీమ్‌లో చేరిన వారికి 7.5 శాతం వడ్డీ వస్తుంది. ప్రతి నెల వడ్డీ డబ్బులు ఇస్తారు. 10 ఏళ్లకు పైగా ఉన్నవారు ఈ పథకం లో చేరచ్చు. రూ.1 లక్ష ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ప్రతి నెల రూ.592 వస్తాయి. రూ.2 లక్షలు చేస్తే రూ.1183, రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.2958 వస్తాయి.
గరిష్టంగా ఆ పథకంలో జాయింట్ అకౌంట్ తీసి ఇన్వెస్ట్ చేస్తే కూడా బాగుంటుంది. రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.8875 నెల కి వస్తాయి. ఈ స్కీమ్ లో చేరాలంటే సమీపంలో ఉన్న పోస్టల్ శాఖ కి వెళ్లాల్సి వుంది. ఈ స్కీమ్ లో ముగ్గురు వ్యక్తులతో ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. ఆధార్ కార్డ్/ఓటర్ ID/పాస్‌పోర్ట్ మొదలైనవి అవసరం అవుతాయి. అలానే అడ్రెస్ ప్రూఫ్ గా తాజా కరెంటు బిల్లులు/పాస్‌పోర్ట్/పాన్ కార్డ్ మొదలైనవి కావాలి.