రోజుకు రూ.30 సేవ్ చేస్తే చాలు.. రూ.5 లక్షలు..!

-

కేంద్రం చాలా రకాల స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ తో ఎన్నో లాభాలని పొందవచ్చు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిగా రాబడి వస్తుంది. పైగా భవిష్యత్తు లో సమస్యలు కూడా వుండవు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌ల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకంలో పొదుపు చేయడం ద్వారా పలు రకాల ప్రయోజనాలు వున్నాయి. మీ డబ్బులపై మంచి రాబడి కూడా ఈ స్కీమ్స్ తో వస్తుంది. పైగా వీటిలో డబ్బులని పెట్టడం వలన ఎలాంటి రిస్క్ ఉండదు.

బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో పబ్లిక్ ప్రావిండెట్ ఫండ్ ఒకటి. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లుగా వుంది. ఈ స్కీమ్ ని మీరు కావాలంటే ఐదేళ్లు ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళచ్చు. పీపీఎఫ్ పథకం వడ్డీ రేటు 7.1 శాతంగా వుంది. ఈ వడ్డీ రేటును మూడు నెలలకు ఒక సరి సవరిస్తుంటుంది. , స్థిరంగా ఉంచొచ్చు, పెంచొచ్చు, తగ్గించొచ్చు. సెక్షన్ 80సీ కింద మినహాయింపు కూడా వుంది. ఏటా రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దీనిలో గరిష్ఠంగా 1.5 లక్షల వరకు పొదుపు చేయవచ్చు.

ఏటా మీరు రూ.10 వేలు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే.. 20 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ కి మీ చేతికి రూ.4.5 లక్షలకుపైగా వస్తాయి. 7.1 శాతం వడ్డీ కింద చూస్తే.. మొత్తం రూ.2 లక్షలు అవుతుంది. అదనంగా రూ.2.43 లక్షలుగా ఉంటుంది. మొత్తంగా రూ.4.5 లక్షలు వస్తాయి. చాలా తక్కువ మొత్తంతో మంచి రాబడి అందుకోవచ్చు. రూ.27 మాత్రమే మీరు రోజుకి ఇందులో ఇన్వెస్ట్ చెయ్యాల్సి వుంది. నెలకు దాదాపు రూ.1000 పొదుపు చేస్తే మీ చేతికి రూ.5.3 లక్షలు వస్తాయి.  మెచ్యూరిటీ సమయానికి వడ్డీ రేట్లు పెరుగుతూ వెళ్తే ఇంకా ఎక్కువ డబ్బులు మీకు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version