రూ.100 పొదుపుతో రూ.9 లక్షలు..!

-

చాలా మంది భవిష్యత్ లో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని చూస్తుంటారు. ఇప్పటి నుంచే డబ్బులు పొదుపు చేయాలని అనుకుంటూ వుంటారు. మీరు కూడా డబ్బులని ఇప్పటి నుండి ఆదా చేయాలనుకుంటున్నారా..? పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ ప్రొడక్టుల్లో ఇన్వెస్ట్ చెయ్యచ్చు.

రెండు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి భారీ మొత్తం కూడా వస్తుంది. ఎగాన్ లైఫ్ ఐగ్యారంటీ మ్యాక్స్ సేవింగ్స్ ప్లాన్ అనే ఓ ప్లాన్ వుంది. దీనిలో మీరు రోజుకు రూ. 100 పొదుపు చేస్తే రూ. 6.5 లక్షలు పొందొచ్చు.

దీనిలో డబ్బులు పెట్టడం వలన బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు సమానమైన రాబడిని సొంతం చేసుకోవచ్చు. దీని ద్వారా 6.34 శాతం రిటర్న్ లభిస్తుంది. పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా పొందొచ్చు. నెలకు రూ. 500 నుంచి కూడా డబ్బులు పెట్టచ్చు. ఒకవేళ కనుక పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే అప్పుడు కుటుంబానికి ఒకేసారి కనీసం రూ. 5 లక్షలు లభిస్తాయి. వార్షిక ప్రీమియం మొత్తానికి 11 రెట్లు బీమా వస్తుంది.

ఈ ప్లాన్ కోసం మీరు పాన్ నెంబర్ , ఆధార్ కార్డు ఇస్తే చాలు. ఇంకేం అక్కర్లేదు. 30 ఏళ్లు వ్యక్తి నెలకు రూ. 3 వేల చొప్పున పదేళ్ల వరకు డబ్బులు పెడితే ఏడాదికి దాదాపు రూ. 37 వేల ప్రీమియం చెల్లించాలి. పదేళ్ల తర్వాత రిటర్న్ పొందాలంటే అప్పుడు మీకు చేతికి రూ. 5 లక్షలు వస్తాయి. ఇన్సూరెన్స్ కవరేజ్ రూ. 4.17 లక్షలు… 40 ఏళ్ల వరకు కవరేజ్ ఉంటుంది. ఒకవేళ మీరు ప్రీమియం మొత్తం పెంచుకుంటే అప్పుడు మీకు వచ్చే రిటర్న్ కూడా పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version