అదిరే స్కీమ్… నెలకి లక్ష పెన్షన్..!

-

చాలా మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. నిజానికి ఇలా ఇన్వెస్ట్ చేస్తే చక్కటి ఆదాయాన్ని పొందేందుకు అవుతుంది. అలానే భవిష్యత్తు లో ఏ ఇబ్బంది కూడా రాదు. వృద్ధాప్యం లో లేదా రిటైర్మెంట్ తరువాత భవిష్యత్ కోసం ఆలోచించే వారికి ఎల్ఐసీ సూపర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. మరిక ఆ స్కీమ్ వివరాలని చూసేద్దాం.

దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా వృద్ధాప్యపు ఖర్చుల్ని ఈజీగా అధిగమించవచ్చు. ఇందులో మీరు ఒకసారి పెట్టుబడి పెడితే చాలు జీవితాంతం గ్యారంటీ పెన్షన్ వస్తుంది. ఆ స్కీమ్ పేరే ఎల్ఐసీ జీవన్ శాంతి. ఇందులో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పెన్షన్ ని పొందచ్చు. నెలకు రూ. లక్ష కన్నా అధిక మొత్తాన్ని పెన్షన్ కింద పొందచ్చు.

ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాన్యుటీ రేట్లను అప్‌డేట్ చేసింది. సో పాలసీదారులకు వారి ప్రీమియంలకు ఎక్కువ పెన్షన్ వస్తుంది. రూ.లక్ష పెన్షన్ ని మీరు ప్రతీ నెలా పొందాలి అంటే 12 ఏళ్లకు రూ.కోటి పెట్టుబడి పెట్టాలి. 12 ఏళ్ల తర్వాత నెలకు రూ.1.06 లక్షల జీతం మీకు వస్తుంది. కేవలం 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి అంటే మెచ్యూరిటీ తర్వాత పెన్షన్‌గా మీకు నెలకు రూ.94,840 పెన్షన్ వస్తుంది. అదే మీరు రూ. 50 లక్షలు పెడితే అప్పుడు మీకు రూ. 50,000 వస్తాయి. 12 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.53,460 మీకు వస్తుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version