కేవ‌లం రూ.12 కే రూ.2 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ పాల‌సీ.. ఇలా పొందండి..!

-

ప్ర‌తి ఏడాది చాలా మంది ప్ర‌మాదాల బారిన ప‌డి ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ఆర్థికంగా బాగా స్థోమ‌త ఉన్న‌వారు అయితే ఫ‌ర్వాలేదు. కానీ పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన కుటుంబాల్లో సంపాదించే వారు చ‌నిపోతే మిగిలిన కుటుంబ స‌భ్యులు చెప్ప‌లేని క‌ష్టాల‌ను అనుభ‌విస్తుంటారు. అలాంటి వారికి ఆర్థిక స‌హాయం అందించేందుకు గాను మోదీ ప్ర‌భుత్వం గతంలోనే ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.

ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న స్కీమ్ (పీఎంఎస్‌బీవై)ను ఎవ‌రైనా పొంద‌వ‌చ్చు. అందుకుగాను వారు త‌మ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ఖాతాలోకి లాగిన్ అయి అందులో ఉండే పీఎంఎస్‌బీవై అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. దీంతో ఖాతాదారు అకౌంట్ నుంచి రూ.12 డెబిట్ అవుతాయి. ప్ర‌తి ఏడాది జూన్ నుంచి ఆగ‌స్టు మ‌ధ్య ఆ మొత్తం ఆటోమేటిగ్గా డెబిట్ అయ్యేలా సెట్ చేసుకోవ‌చ్చు. దీంతో టైముకు ఆ మొత్తం అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. జూన్ 1 నుంచి వ‌చ్చే ఏడాది మే 31వ తేదీ వ‌ర‌కు ఇన్సూరెన్స్ వ‌ర్తిస్తుంది. ఏడాది పూర్తి కాగానే ఆ మొత్తం అకౌంట్ నుంచి డెబిట్ అయ్యాక మ‌ళ్లీ అవే తేదీల్లో ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది.

పీఎంఎస్‌బీవై స్కీమ్ కింద ఇన్సూరెన్స్ పొందిన వారికి రూ.2 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ వ‌స్తుంది. ఇన్సూరెన్స్ తీసుకున్న వారు చ‌నిపోతే ఆ మొత్తం అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు లేదా నామినీకి అందుతుంది. లేదా యాక్సిడెంట్‌లో క‌ళ్లు, కాళ్లు, చేతుల‌ను కోల్పోయి శాశ్వ‌త విక‌లాంగుల్లా మారితే రూ.2 ల‌క్ష‌లు, పాక్షికంగా విక‌లాంగులు అయితే రూ.1 ల‌క్ష వ‌రకు ఇన్సూరెన్స్ వ‌స్తుంది. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో 18 నుంచి 70 ఏళ్ల వ‌య‌స్సు వారు ఎవ‌రైనా చేర‌వ‌చ్చు. ఏడాదికి రూ.12 ప్రీమియం చెల్లిస్తే చాలు రూ.2 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ ల‌భిస్తుంది. ఇది పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది.

అయితే ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ లేనివారు త‌మ బ్యాంకు బ్రాంచిలో సంప్ర‌దించి కూడా ఈ స్కీమ్‌లో చేర‌వ‌చ్చు. ఇన్సూరెన్స్ పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version