నెలకు పది వేలు రావాలా…? అయితే ఈ స్కీంలో చేరితే బెటర్…!

-

కేంద్ర ప్రభుత్వం 2017 లో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశ పెట్టిన స్కీమ్ ప్రధాన మంత్రి వయ వందన యోజన. నెల నెలా పెన్షన్ అందుకోవడం కోసం ప్రవేశ పెట్టిన స్కీం ఇది. అసలు ఆ స్కీం ఏ విధంగా ఉంటుంది…? నెలకు ఎంత వరకు మనం తీసుకోవచ్చు…? ఎంత పెట్టుబడి ఆ స్కీం లో పెట్టవచ్చు అనే వివరాలు చూద్దాం. దీనిని స్కీమ్‌ను లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC నడిపిస్తుంది.

ఈ స్కీం రూ.1,000, నుంచి రూ.10,000 వరకు పెన్షన్ పొందొచ్చు. మీరు పెట్టె పెట్టుబడి మీద మీరు పొందే పెన్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. మీకు నెలకు 10 వేలు పెన్షన్ కావాలి అనుకుంటే రూ.15,00,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన నాటి నుంచి మీకు నెలకు 10 వేలు పెన్షన్ వస్తుంది. అలా పదేళ్ళు వస్తుంది… ఆ తర్వాత మీరు ఎంత పెట్టుబడి అయితే పెడుతున్నారో అది తిరిగి మొత్తం ఇచ్చేస్తారు. దీనికి ఆధార్ నెంబర్ అనేది తప్పక కావాల్సి ఉంటుంది. మీకు ఏడాదికి రూ.1,20,000లోన్ సదుపాయం కూడా ఉంటుంది.

పాలసీ పూర్తైన తర్వాత గరిష్టంగా 75% రుణం తీసుకోవచ్చు. వడ్డీ ఏడాదికి 10% చెల్లించాలి. ఆన్‌లైన్‌లో తీసుకుంటే 30 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. ఫ్రీ లుక్ పీరియడ్ లో పాలసీ నచ్చకపోతే తీసుకున్న 15 రోజుల్లో వెనక్కి ఇచ్చేయొచ్చు. ప్రీమెచ్యూర్ ఎగ్జిట్- 10 ఏళ్ల గడువు పూర్తికాకముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98% మాత్రమే వెనక్కి వస్తుంది. ఒకవేళ 10 ఏళ్లు పూర్తికాకముందే పెట్టుబడి పెట్టిన వ్యక్తి చనిపోతే రూ.15,00,000 వారి జీవితభాగస్వామి లేదా పిల్లలు లేదా నామినీకి వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version