వాస్తు: ఈ మొక్కల వలన ఇబ్బందులు వస్తాయి..!

-

మనింట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుతూ ఉంటాం. మొక్కల వల్ల ఇంటి ఆవరణ అంతా కూడా ఎంతో అందంగా ఉంటుంది. అలానే మొక్కలు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కల్ని పెంచడం మంచిది కాదని పండితులు అంటున్నారు. మరి ఏ మొక్కలు ఇంట్లో ఉంటే మంచిది కాదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని కోసమే పూర్తిగా చూసేయండి.

ముళ్ల మొక్కలు:

గులాబీలు తప్పించి ముళ్లతో కూడి ఉన్న మొక్కలు ఏమీ కూడా ఇంట్లో కాని ఆఫీసులో కాని ఉండడం మంచిది కాదని పండితులు అంటున్నారు. కాబట్టి ముళ్ళ మొక్కలని వీలైనంత వరకు పెంచకుండా ఉండండి.

చింత:

చింత చెట్టు చూడడానికి చాలా బాగుంటుంది కానీ ఇంట్లో దానిని పెంచకూడదు. ఎందుకంటే చింత చెట్టు మీద దెయ్యాలు అవి ఉంటాయని దీని వల్ల నెగటివ్ ఎనర్జీ కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి చింత చెట్టు కూడా పెంచడం అంత మంచిది కాదు.

బోన్సాయ్:

అదే విధంగా బోన్సాయ్ మొక్కలు కూడా ఇంట్లో పెంచడం మంచిది కాదని ఈ రోజుల్లో చాలా మంది బోన్సాయ్ మొక్కలను పెంచుతున్నారని… కానీ దీని వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని పండితులు చెప్పడం జరిగింది కాబట్టి దీనిని కూడా పెంచకండి.

అలానే ఇంట్లో ఉండే ప్రతి ఒక్క కూడా ఎంతో పచ్చ గా ఫ్రెష్ గా ఉండాలి. ఆకులు ఎండిపోయినవి చనిపోయిన మొక్కలు ఇంట్లో ఉంచడం మంచిది కాదు. దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ కి దారి తీస్తుంది అలానే దూది చెట్టుని కూడా ఇంట్లో ఉంచకూడదు. ఒకవేళ ఈ మొక్కలు ఇంట్లో లేకుండా చూసుకోండి లేదంటే ఇబ్బందులు తప్పవు.

Read more RELATED
Recommended to you

Latest news