మన దేశంలో ఎన్నో ప్రత్యేకత కలిగిన ఆలయాలున్నాయి. కొన్ని ఆలయాలకు వెళ్తే కొన్ని కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కొన్ని దేవాలయాల్లో స్థలపురాణం ఒకటయితే స్వామివారు తీర్చిన కోరికలను బట్టి ఆయనకి కొత్తపేరు పెట్టిన క్షేత్రాలు వున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని మురమళ్ళ శ్రీవీరేశ్వరస్వామివారి దేవస్థానంలో స్వామివారికి కల్యాణం జరిపిస్తే వివాహంలో జరగనున్న విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలోని వీరభద్రునకు, భద్రకాళీ అమ్మవారికి వివాహం జరిగిందని స్థల పురాణం.
ఇక్కడ కళ్యాణం చేయించదలచినవారు ఆలయంలో పేరు నమోదు చేయించుకోవాలి. మీ పేరు, పుట్టినతేదీ, వివరాలు తెలియచేస్తే మీరు ఎప్పుడు స్వామివారికి కళ్యాణం జరిపిస్తే మంచిదో వారే తారీఖు నిర్ణయిస్తారు. మీరు దూరప్రాంతం నుంచి వస్తున్నవారైతే వసతిసౌకర్యం కూడా దేవాలయం దగ్గరలోనే వుంటుంది. వృధ్ధ గోదావరీ తటంలో వున్న క్షేత్రం మురమళ్ళ. ఇక్కడ స్వామి శ్రీ భద్రకాళీసమేత శ్రీ వీరేశ్వరస్వామిగా పిలుస్తారు. సతీదేవి పుట్టింట్లో జరిగే యజ్ఞం పురాణ కథల ప్రకారం దక్షుడు యజ్ఞం చేయటం, దానికి పరమశివుణ్ణి ఆహ్వానించకపోవటం, సతీదేవి పుట్టింట్లో జరిగే యజ్ఞం చూడాలనే ఆకాంక్షతో వెళ్ళటం, అక్కడ శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేక యోగాగ్నిలో భస్మమవటం అందరికీ తెలిసిందే.
దక్షయజ్ఞంలో సతీదేవి భస్మమవటంతో కోపించిన శివుడు వీరభద్రుడుని సృష్టించి దక్షయజ్ఞ వినాశనానికి పంపుతాడు. ఆయననే ఇక్కడ వీరేశ్వరుడంటారు. ఆయన మహా భయంకర రూపందాల్చి దక్షయజ్ఞాన్ని నాశనం చేస్తాడు. తర్వాత దక్షుడు పశ్చాత్తాపపడటంతో ఆయనకి మేక తల అతికించి ఆ యజ్ఞాన్ని పరిపూర్తి చేస్తారు. కానీ సతీ దహనంవల్ల వీరేశ్వరుడు ఎంతకీ శాంతించడు. ఆ భయంకర రూపాన్ని చూసి భయకంపితులైన మునులు, దేవతలు విష్ణుమూర్తిని వీరేశ్వరుడిని శాంతింపచేయమని ప్రార్ధిస్తారు.
కన్యరూపంలో వున్న భద్రకాళిని చూసి వీరేశ్వరుడు శాంతించాడు. ఇదంతా జరిగింది మహామునులందరూ గౌతమీ తటంలో ఆశ్రమాలు ఏర్పరుచుకుని నివసిస్తున్న ప్రదేశంలో వీరేశ్వరస్వామి దానిని మునిమండలి అనేవారు. మునులందరూ ఆ మునిమండలిలో వీరేశ్వరస్వామికి, భద్రకాళికి గాంధర్వ పధ్ధతిన వివాహం జరిపి స్వామిని శాంతింపచేశారు. తుఫాను ప్రపంచం తెగబడ్డారు. ప్రతిరోజు 108 జంటలకు కళ్యాణాలు నిర్వహిస్తారు. ఈ కళ్యాణంలో పాల్గొన్న వారికి తక్షణమే వివాహం జరుగుతుంది.