నైవేద్యంగా చక్కెర పెడితే ఏం జరుగుతుందో తెలుసా..!?

-

గుడిలో వెలసిలిన దేవుడికి అయినా.. ఇంట్లో దేవుడికి అయినా మనం ఎక్కువగా నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇక నిత్యపూజ అయినా విశేష పుణ్య తిథుల్లో చేసే ప్రత్యేక పూజలు అయినా నైవేద్యం తప్పనిసరిగా సమర్పించవలసిందే. కొలువై ఉన్న దైవానికి ఎలాంటి లోటూ జరగకూడదనే ఉద్దేశ్యంతో, వివిధ రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. ఇందులో ప్రధానమైనది నైవేద్యం సమర్పించడం. ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైన దేవుని కృప పూర్తిగా దక్కే మార్గం. అయితే ఇలాంటి అతి ముఖ్యమైన ప్రక్రియలో మనం తెలిసి లేదా తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాము.

shivudu

ఇక చాలా సందర్భాల్లో దేవుడికి నైవేద్యంగా తీపి వంటలు చేసి పెడుతారు. అయితే సమయం లేనప్పుడు పప్పు చక్కెర, చక్కెర, చక్కెర కలిపిన పాలు , అన్నంలో చక్కెర వేసి పెడుతుంటారు. ఇది చాలా చోట్ల మనం చూస్తూనే ఉంటాం. అయితే, కొంతమంది చక్కెర నైవేద్యం గా పెట్టడం దోషం అని అంటుంటారు. ఇలా చేయడం దోషం ఏమి కాదని వేదపండితులు సైతం చెబుతున్నారు.

అయితే నైవేద్యం, నివేద అంటే మనం ఏ ఆహారం తీసుకుంటామో.. అదే దేవుడికి సమర్పించడం..ఇంకా చెప్పాలంటే మనకి తినాలనిపించిన రుచులు దేవుడికి నైవేద్యంగా పెట్టి మన కోరికలు ధర్మ బద్ధం చేసుకుంటూ ప్రసాదం గా చేసుకోవడం వలన అది మనలని ఎంతగానో ఉద్ధరిస్తుంది అనడం లో సందేహమే లేదు.. భగవంతుడు ఆహారంగా తీసుకోవడానికి మాకు ఈ పదార్థాలు ఇచ్చాడు, అని ఆ దేవుడికి కృతజ్ఞతాభివందం చేయడమే.

కాబట్టి.. చక్కెరను వేయడం వల్ల ఎలాంటి దోషం లేదని చెబుతున్నారు పండితులు. ఏది తిన్నా కూడా భగవంతుడికి నివేదించి తినడం వలన ప్రసాదం అవుతుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో శుచిగా వండి ప్రేమ తో భగవంతుడికి ఏది పెట్టిన అది భక్తి లో భాగమే అవుతుంది అని పండితులు తెలియచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version