“గద్దలకొండ గణేష్” సినిమాతో హిట్ కొట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ఖాతాలో మరో హిట్ ని వేసుకున్నాడు. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. వరుణ్ కెరీర్ లో 10 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఘని అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు సినిమా యూనిట్ కొద్ది సేపటి క్రితం ప్రకటించింది.
అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ ఈ సినిమాని నిర్మిస్తుండగా థమన్ సంగీతమందిస్తున్నాడు. గద్దలకొండ గణేష్ సినిమాలో ఊర మాస్‌గా నటించిన వరుణ్ తేజ్ ఇప్పుడు బాక్సర్‌గా ఎలా ఆకట్టుకుంటాడో అన్న ఆసక్తి అందరిలోను నెలకొంది. ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, సాయి మంజ్రేకర్ లాంటి వాళ్ళు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.