GHANI TEASER : “గని” టీజర్ రిలీజ్.. బాక్స్ బద్దలే అంటూ వచ్చేసిన వరుణ్ తేజ్

-

వరుస హిట్లతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దూసుకుపోతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథను ఎంపిక చేసుకుంటున్న వరుణ్ తేజ్… ప్రస్తుతం గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ ను తాజగా విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ టీజర్ లో వరుణ్ తేజ్.. అదరగొట్టాడు. రామ్ చరణ్ వాయిస్ తో యాక్షన్ ఫీస్ట్ సన్నివేశాలు, అదిరిపోయే డైలాగులు  టీజర్ కే హైలెట్ గా నిలిచాయి. బాక్సింగ్ కోసం వరుణ్ చేసే.. ప్రయత్నాలను ఈ టీజర్ లో చూపించారు. మొత్తానికి టీజర్ ఈ సినిమా పై అంచనాలను పెంచేశాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version