పేపర్ లీకేజీలో తప్పయినా.. ఒప్పయినా.. బాధ్యత TSPSCదే.. తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని TSPSC మాజీ ఛైర్మన్ గంటా చక్రపాణీ వెల్లడించారు. TSPSC పేపర్ లీకేజీ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది.
అయితే..దీనిపై TSPSC మాజీ ఛైర్మన్ గంటా చక్రపాణీ స్పందించారు. TSPSC సంక్షోభం పూర్తిగా ఆ వ్యవస్థ కు పరిమితమైన విషాదం అన్నారు. ఎందరో గుండెకోతను ఎదుర్కొంటున్న సమయం అని తెలిపారు. ఇది దురదృష్టకర సందర్భం. అదొక రాజ్యాంగ సంస్థ. దానిపై ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. లేదు. తప్పయినా ఒప్పయినా బాధ్యత TSPSCదే. ఇదంతా రాజకీయ ప్రయోజనాలకోసం చెలరేగుతున్న రాద్ధాంతం అంటూ ట్వీట్ చేశారు TSPSC మాజీ ఛైర్మన్ గంటా చక్రపాణీ.