టిఆర్ఎస్ నేతలపై రూ.11 లక్షల ఫైన్ వేసిన జిహెచ్ఎంసి !

-

టీఆర్ఎస్ ప్లీనరీ ప్లెక్సీల ఏర్పాటు పై భారీగా జరిమానాలు పడ్డాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేతలకు జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ ఫైన్ లు విధిస్తుంది. అత్యధికంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కు మొత్తం 3 లక్షల 45 వేల జరిమానా వేసిన జీహెచ్ఎంసీ.. ఆ తర్వాత మంత్రి తలసానికి 1,90,000 జరిమానా విధించింది.

అటు మంత్రి మల్లారెడ్డి కి రూ. 10, 000 వెయ్యగా.. టి.ఆర్.ఎస్ జనరల్ సెక్రటరీ కి రూ 2,85,000 వేసింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కి 75 వేల రూపాయలు వేసిన జీహెచ్ఎంసీ.. అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు 30 వేలు ఫైన్ వేసింది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పదివేలు ఫైన్ వేసింది.

టి.ఆర్.ఎస్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు 2 లక్షలు జరిమానా విధించింది జిహెచ్ఎంసి… ఇప్పటివరకూ టీఆర్ఎస్ ప్లీనరీ కోసం ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలపై ఆ పార్టీకి చెందిన నాయకులకు 11 లక్షల 55 వేల రూపాయల జరిమానా విధించింది జిహెచ్ఎంసి. సర్వర్ అప్ గ్రేడేషన్ తో నిన్నటి నుంచి మళ్లీ చలానాలు జనరేట్ చేస్తుంది జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version