గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందింది.
జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులపైకి దూసుకెళ్లింది ట్రక్కు. అక్కడికక్కడే కార్మికురాలు రేణుక మృతి చెందింది. దీంతో ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక అటు హుస్సేన్ సాగర్ కి భారీగా గణనాథులు..చేరుకుంటున్నాయి. 40 క్రేన్ల ద్వారా విగ్రహాల నిమజ్జనం
కొనసాగుతోంది. తెల్లవారుజామున నాలుగు గంటల తర్వాత నుంచి విగ్రహాల తాకిడి పెరిగింది. ఈ రోజు మధ్యాహ్నం వరకు విగ్రహాల నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. సాయంత్రం సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో మధ్యాహ్నం లోపు విగ్రహాల నిమజ్జనం పూర్తి అయింది.