మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరో షాక్ తగిలింది. తాడిపత్రి వదిలి వెళ్లాలని YSRC Party
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ఆదేశాలు ఇష్యూ చేశారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలో ముఖ్యమంత్రి పర్యటన.. పోలీసు బలగాలు సీఎం పర్యటనకు కేటాయించామని వెల్లడించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అనంతరం తాడిపత్రి రావాలని కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు సూచనలు చేశారు. లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వాలని కోరారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
కానీ దీనికి పోలీసులు నిరాకరించారు.. పోలీసుల వైఖరిని ప్రశ్నించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు.