రాష్ట్రంలో ఏదోమూల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వ్యక్తిగత కక్షలైతే మరికొన్ని భూతగాదాలు, కబ్జాలకు సంబంధించిన గొడవలు ఇటీవలి కాలంలో తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా భూతగాదాల కారణంగా రోడ్డుపైనే ఇరువర్గాలు ఘోరంగా కొట్టుకున్నాయి.
ఈ ఘటన మహాబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం జీకే తండాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఒక వర్గంలోని కొందరికి గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి తండాకు వెళ్తుండగా దారి కాచి నడిరోడ్డు మీద మరోవర్గం దాడులకు పాల్పడింది. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భూతగాదాలో రోడ్డు పైనే ఘోరంగా కొట్టుకున్న ఇరువర్గాలు
మహాబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం జీకే తండాలో భూతగాదాలో రెండు వర్గాల మధ్య గొడవ
ఒక వర్గంలోని కొందరికి గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి తండాకు వెళ్తుండగా, దారి కాచి నడిరోడ్డు మీద దాడి చేసిన మరోవర్గం pic.twitter.com/MixUz6YIYe
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2025