ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్ర్మన్ గిల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ మెగా టోర్నీ సన్నహాకాల్లో భాగంగా స్వదేశంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో గిల్ దుమ్ములేపుతున్నాడు. తొలి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన గిల్.. ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో అద్భుతమైన శతకంతో మెరిశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత్ కి గిల్ మరోసారి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆదిలోనే ఔటైనప్పటికి.. గిల్ మాత్రం కోహ్లితో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ
క్రమంలో గిల్ 95 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్ సాయంతో తన సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. గిల్ కి ఇది ఏడో వన్డే సెంచరీ కావడం విశేషం. గిల్ తో పాటు మరో ఎండ్ లో శ్రేయస్ అయ్యర్ కూడా అధ్బుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.