ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ కి కరోనా అంటించిన అమ్మాయి…?

-

కరోనా పుణ్యమా అని కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త హడావుడి చేస్తున్నాయి. తప్పుడు ప్రచారం కొంత ఉంటే వాస్తవాలు మరికొంత ఉంటుంది. రోజు రోజుకి కరోనా పెరుగుతున్న కొద్దీ ఏదోక వార్త వస్తూనే ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇండోర్ లోని లుసాడియా గ్రామంలో ఒక అమ్మాయికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఆమె బాయ్ ఫ్రెండ్ కుటుంబం మొత్తాన్ని తీసుకుని వెళ్లి ఐసోలేషన్ లో ఉంచారు. ఆ తర్వాత విచారణలో ఆ అమ్మాయికి ఇంకో ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలియడంతో ఆ మూడు కుటుంబాలను కూడా పట్టుకెళ్లి ఐసోలేషన్లో ఉంచారు అధికారులు. ఆ నలుగురు బాయ్ ఫ్రెండ్స్ లో ఒకడికి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అధికారులకు తెలిసింది.

దీనితో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ కుటుంబాలను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారట. చివరికి ఈ చైన్ ఎంత పొడవు సాగుతుందో ఏమో? అని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు కరోనా తీవ్రంగా ఉందని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ ఘటనలో ఎంత మందికి కరోనా ఉందా అనేది తెలియడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version