చాటింగ్ చేస్తుందని.. బాలిక మరణానికి కారణమైంది

-

ఆన్లైన్ క్లాసుల కోసం తండ్రి సెల్ ఫోన్ కొనివ్వడమే పాపమైంది. తన చావుకు కారణమైంది. సెల్ ఫోన్ లో తరుచూ చాటింగ్ చేస్తుందని కుటుంబ సభ్యులు మందలించడమే చావుకు కారణమైంది. ఈ దారుణమైన ఘటన మియాపూర్ లో చోటు చేసుకుంటుంది. మియాపూర్ హనీఫ్ కాలనీలో నివాసం ఉంటున్న నందిని కీసర గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఆన్లైన్ క్లాసుల కోసం తండ్రి సెల్ ఫోన్ కొనిచ్చాడు. సెల్ ఫోన్ లో తరుచూ చాటింగ్ చేస్తుందని గుర్తించిన కుటుంబ సభ్యులు మందలించారు. వరసకు మామ వరసయ్యే వ్యక్తితో చాటింగ్ చేస్తుండటంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో తండ్రి సిమ్ కార్డ్ మార్చాడు. ఇటీవల తండ్రి పనికి వెళ్లిపోయాక, చాటింగ్ విషయంపై సొంత బాబాయ్ తో బాలిక గొడవ పడింది. దీంతో మనస్తాపాలనికి గురైన సదరు బాలిక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని తనువు చాలించింది. తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాధితురాలిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మరణించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version