పెళ్లి చేసుకోలేద‌ని ప్రియుడి పై ప్రియురాలి యాసిడ్ దాడి

-

త‌న‌ను పెళ్లి చేసుకోలేద‌ని ప్రియురాలి దారుణానికి పాల్ప‌డింది. ప్రియుడి పై యాసిడ్ పోసి.. క‌త్తి తో దాడి చేసింది. అంతే కాకుండా తాను నిత్ర మాత్ర‌లు తీసుకుని ఆత్మ హ‌త్య చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించింది. అయితే మోసం చేశాడ‌ని ప్రియుడి పై ప్రియురాలు యాసిడ్ దాడి చేసిన కేర‌ళ లో జ‌రిగిన ఘ‌ట‌న ను మ‌ర‌వక ముందే తాజా గా ఈ ఘ‌ట‌న త‌మిళ నాడు లో చోటు చేసుకుంది. వివ‌రాల్లో కి వెళ్తే.. కేర‌ళ కు చెందిన రాకేష్ (30), త‌మిళ‌నాడు కు చెందిన జ‌యంతి (27) ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు.

అక్క‌డ వీరి మ‌ధ్య పరిచయం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ గా మ‌రి కొద్ది రోజుల పాటు స‌హా జీవ‌నం చేశారు. అయితే రాకేష్ ఇటీవ‌ల కేర‌ళ కు వ‌చ్చి మ‌రొక అమ్మాయి ని వివాహం చేసుకున్నాడు. జ‌యంతి కూడా భార‌త్ వ‌చ్చాక.. రాకేష్ పెళ్లి గురించి తెలుసుకుంది. దీని పై ఫోన్లో గొడ‌వ కూడా జ‌రిగింది. అయితే ఈ విష‌యం పై వ్య‌క్తి గ‌తం గా క‌లిసి న స‌మ‌యం లో వివ‌రిస్తా.. అని రాకేష్ చెప్పాడు. దీంతో రాకేష్ ను జ‌యంతి త‌మిళనాడు కు ర‌మ్మంది. దీంతో త‌మిళ నాడు కు వెళ్లిన రాకేష్ పై జ‌యంతి యాసిడ్ పోసింది. అంతే కాకుండా క‌త్తి తో దాడి చేసింది.

 

అలాగే జ‌యంతి కూడా నిద్ర మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్య కు పాల్పండింది. అయితే రాకేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో జ‌యంతి పై పోలీసులు కేసు ను న‌మోదు చేసి విచార‌ణ చేశారు. త‌న వ‌ద్ద నుంచి రూ. 18 ల‌క్ష‌లు తీసుకుని మోసం చేశాడని అందుకే దాడి చేశాన‌ని జ‌యంతి తెలిపింది. కాగ జ‌యంతి కి ఇప్ప‌టి కే వివాహం జ‌రిగి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. అయితే జ‌యంతి ప్ర‌స్తుతం త‌న భ‌ర్త నుంచి విడాకులు తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version