మళ్లీ టొమాటో చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా కిలో టొమాటో రూ. 50 లోపే లభిస్తుండటంతో సంతోష పడిన సామాన్యుడికి ఇది మూన్నాళ్ల ముచ్చటగానే ఉంది. తాజాగా మరోసారి టొమాటో ధరలు సెంచరీని దాటాయి. తాజాగా టొమాటోకు కేరాఫ్ గా ఉండే మదనపల్లి మార్కెట్ లో కిలో టొమాటో రూ. 102కు చేరింది.
ఇటీవల రాయసీయలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా టొమాటో పంటపై తీవ్ర ప్రభావం పడింది. చిత్తూర్, కడప, నెల్లూర్, అనంతపూర్ జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో టమాటో పంట దెబ్బతినడం, దిగుబడి తగ్గింది. దీని కారణంగా టొమాటోకు ఎక్కడా లేని ధర పలికింది. స్వయంగా కొంతమంది రైతుల్ని లక్షాధికారులను కూడా చేసింది. ఏకంగా కిలో టొమాటోకు రూ. 150కి చేరింది. ఆతరువాత ఉత్తర భారతదేశం నుంచి టొమాటో దిగుమతి చేసుకున్న తరువాత టొమాటో రేట్లు పడిపోయాయి. అయితే మళ్లీ ప్రస్తుతం టొమాటో రేట్లు మళ్లీ పెరగడం సామాన్యుడికి ధడ పుట్టిస్తున్నాయి.