మద్యం కోసం క్యూ లైన్లో అమ్మాయిలు…!

-

మద్యం అమ్మకాలు దేశ వ్యాప్తంగా మొదలయ్యాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ఇప్పుడు మొదలు కావడంతో జనం బారులు తీరుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మద్యం కోసం ఇప్పుడు ప్రజలు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. కొంత మంది లంచ్ బాక్స్ ని కూడా పట్టుకుని వెళ్లి మద్యం కోసం ఎదురు చూస్తున్నారు. వేలాది మంది లైన్ లో ఉంటున్నారు.

ఇక బెంగళూరు లో అయితే అమ్మాయిలూ లైన్ లో నిలబడటం గమనార్హ౦. వారిలో కాలేజి అమ్మాయిలు కూడా ఉండటం గమనార్హం. పదుల సంఖ్యలో అమ్మాయిలు బెంగళూరు రోడ్ల మీద మద్యం కోసం నిలబడ్డారు. వీరిలో ఆంటీలు కూడా ఉన్నారు. తల్లి తండ్రులు చూస్తారు అనే భయం కూడా లేకుండా అమ్మాయిలూ యువకులు అందరూ కూడా రోడ్ల మీద పడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బెంగళూరులో ఒక యువకుడు ఒక చోట మద్యం కోసం నిలబడగా అదే చోటకు అతని సోదరి కూడా వెళ్ళడం చూసి అతను షాక్ అయ్యాడు. ఇలాంటి సంఘటనలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. అమ్మాయిలు ఇలా మద్యం కోసం బారులు తీరడం పై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు తప్పుడు సంకేతాలు ఇస్తాయని ఇది మంచి విధానం కాదు అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version