నా భర్తను నాకు తిరిగి ఇచ్చేయాలని ఇంకేం వద్దని ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి భార్య ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం కేవలం తన స్వార్థమే చూసుకుంటోందని.. వారికి VIPల ప్రాణాలే ముఖ్యం.. సామాన్యులవి కావని అన్నారు. అన్నింటిపై ట్యాక్స్ కడుతున్నా.. నా భర్తకు భద్రత లేదని వాపోయారు.
అసలు మీరేం యాక్షన్ తీసుకుంటారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఉగ్రదాడిలో భర్తని కోల్పోయిన కుటుంబాలను కేంద్రంలోని పెద్దలు పరామర్శించడానికి వెళ్లిన క్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల జమ్ముకాశ్మీర్‌లోని పహెల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు అసువులు బాసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే కేంద్రం పాకిస్తాన్‌కు దీటుగా బదులిచ్చేందుకు సిద్దమవుతోంది.