ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత

-

ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. ఇవాళ ఉదయం బెంగళూరులోని నివాసంలో ఆయన చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 1994 నుంచి 2003 వరకు ఆయన ఇస్రో చైర్మన్ గా గా కొనసాగారు. PSLV, జీఎస్ఎల్వీ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించారు. 2020 జాతీయ విద్యా విధానం రూపకల్పన కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు. 

మోదీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ తో సత్కరించింది. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారాయన. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణన్ మీద దేశద్రోహం ఆరోపణలు వచ్చిప్పుడు ఇస్రో చైర్మన్గా ఉంది కస్తూరి రంగనే. 1969లో లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రంగన్ భార్య 1991లో కన్నుమూశారు.

Read more RELATED
Recommended to you

Latest news