జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం కార్యాచరణలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యను తీసుకుంది. దీంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. భారతదేశం తమపై దాడి చేస్తుందని పాక్ ప్రభుత్వం భయపడుతోంది. అదే సమయంలో తాము పెంచి పోషిస్తున్న ఉగ్రవాద నాయకులను దాచే పనిని కూడా ప్రారంభించిందని వార్తలు వినిపించాయి.
తాజాగా భారత్ పై పాకిస్తాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పాక్ కి నీటిని ఆపుతారా..? ఆపి చూడండి. మాకు నీళ్లు ఆపితే.. మీకు శ్వాస ఆపుతామని ఉగ్రవాద సూత్రధారులు, జైషె మహ్మద్ వ్యవస్థాపకులు మసూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై మసూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇషాక్ మాత్రం పహల్గామ్ లో దాడులు చేసిన వారు స్వాతంత్ర సమరయోధులు అయి ఉండవచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మజ