OTT : అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న గాడ్‌ ఫాదర్‌, సర్దార్‌… ఎప్పుడంటే..

-

థియేటర్లలో విడుదలైన సినిమాలు ఓటీటీల్లోకి ఎప్పుడు వస్తాయి? అని ఎదురు చూసే వీక్షకులు కొందరు ఉన్నారు. అయితే… ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, డైరెక్టుగా డిజిటల్ రిలీజ్ అయ్యే సినిమాల కోసం వేచి చూసే వీక్షకులు సైతం ఉన్నారు. థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు ధీటుగా ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర పెద్ద సినిమాల హడావిడి ఏమీ లేదు. సమంత ‘యశోద’నే ఇంకా తన జోరును చూపిస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలు మూడు బరీలోకి దిగుతున్నాయి. ఆ జాబితాలో సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన ‘గాలోడు’ .. కావ్య ప్రధానమైన పాత్రను పోష్గించిన ‘మసూద’ .. కొత్త వాళ్లు చేసిన ప్రయోగంగా ‘అలిపిరికి అల్లంత దూరంలో’ సినిమాలు ఉన్నాయి. ‘గాలోడు’ సినిమాపైనే గానీ .. ‘అలిపిరికి అల్లంత దూరంలో’ పై గాని పెద్దగా బజ్ లేదు. కంటెంట్ పరంగా ‘మసూద’ పై మాత్రం జనాలు ఆసక్తిని చూపుతున్నారు.

ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ అంచనాలు పెంచేసింది. అందువలన కంటెంట్ బాగుంటే ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ వారంలో ఓటీటీలో మాత్రం ఒక రేంజ్ లో సందడి కనిపించనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి జీ 5లో ‘అహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. రొమాంటిక్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో రాజ్ తరుణ్ – శివాని రాజశేఖర్ ప్రధానమైన పాత్రను పోషించారు. ఇక థియేటర్ల దగ్గర భారీ వసూళ్లను రాబట్టిన ‘సర్దార్’ ఈ నెల 18వ తేదీ నుంచి ‘ఆహా’ వేదిక ద్వారా పలకరించనుంది. మెగాస్టార్ కి హిట్ తెచ్చిపెట్టిన ‘గాడ్ ఫాదర్’ ఈ నెల 19వ తేదీ నుంచి ‘నెట్ ఫ్లిక్స్ లో లైన్ మీదకి రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version