కచ్చులూరు బోటు వెలికి తీసి నేటికి ఏడాది..ఆ ముగ్గురి ఆచూకి ఎక్కడ…?

-

కచ్చులూరు వద్ద మునిగిన రాయల్‌ వశిష్ట బోటును గోదావరి నుంచి వెలికి తీసి నేటికి ఏడాది పూర్తయింది. ఎన్నో వ్యవప్రయాసలకోర్చి ప్రమాదం జరిగిన 38రోజుల తర్వాత బోటును బయటకు తీశారు. ఈ ప్రమాదంలో 51 మంది జలసమాధి కాగా, నేటికీ ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదు.

గత ఏడాది సెప్టెంబర్‌ 15న పాపికొండల విహార యాత్రలో జరిగిన పెను ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రాయల్‌ వశిష్ఠ పున్నమి బోటు కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు బోటులో 77 మంది ఉండగా కేవలం 26 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో 51 మంది చనిపోగా, 48 మంది మృతదేహాలే లభ్యమయ్యాయి. విశాఖకు చెందిన ఇద్దరు చిన్నారులతో పాటు మంచిర్యాలకు చెందిన యువతి మృతదేహం నేటికీ లభ్యం కాలేదు.

గోదావరిలో బోటును గుర్తించి, వెలికి తీసే బాధ్యతను కాకినాడ బాలాజీ మెరైన్‌కు చెందిన ధర్మాడి సత్యం బృందానికి అప్పగించింది ప్రభుత్వం. రివర్‌ కూంబింగ్‌ విధానంలో బోటు ఆచూకీని గుర్తించిన ధర్మాడి బృందం… ఎట్టకేలకు 200 అడుగుల లోతున ఇసుకలో కూరుకుపోయిన రాయల్‌ వశిష్ట పున్నమి బోటును వెలికి తీసింది. ఆ నాటి ఘోర ప్రమాదానికి సాక్ష్యంగా కచ్చులూరులో గోదావరి ఒడ్డున బోటు శిథిలాలు దర్శనమిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version