భారీ వర్షాలు, వరదలపై నేడు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. వరదల వల్ల ఆస్తి, పంట, ప్రాణ నష్టాలపై అధికారులతో సమీక్ష జరపనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత జిల్లాలో పర్యటిస్తున్నారు తెలంగాణ మంత్రులు. వరదల నష్టంపై కేంద్రానికి నివేదిక పంపనున్నారు తెలంగాణ ప్రభుత్వం.

కాగా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.