భార్య వేధింపులు తాళలేక మరో భర్త బలయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయే ముందు వీడియో రికార్డు చేసి, అతని చావుకు గల కారణాలను అందులో పేర్కొన్నాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.
మృతుడి స్టేట్మెంట్ ప్రకారం.. మానవ్ శర్మ అనే వ్యక్తి తన భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు.ముంబైలోని టీసీఎస్‌లో రిక్రూట్‌మెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న మానవ్.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నా భార్య టార్చర్ భరించలేకపోతున్నా.దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడండి. నేను ఒంటరిని అయిపోయాను’ అని సెల్ఫీ వీడియో తీసుకుని ప్రాణాలు వదిలాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/ChotaNewsApp/status/1895368672572776774