జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి వెళ్తున్నారా..? అమ్మాయిలూ వీటిని పక్కా గమనించండి..!

-

జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం అంత ఈజీ కాదు మొదటిసారి మీరు మీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి వెళ్తున్నారా..? అయితే కచ్చితంగా వీటిని వారిలో చూడాల్సిందే. అమ్మాయిలు మొదటి సారి మీరు మీట్ అయినప్పుడు కచ్చితంగా ఆ పురుషుల్లో ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది చూడాలి. అప్పుడే వాళ్ళని మీరు ఎంపిక చేసుకోండి లేక పోతే లైఫ్ లో నష్టపోవాల్సి ఉంటుంది. కంఫర్టబుల్ గా సురక్షితంగా ఉండే ప్లేస్ లో మీట్ అవడం వలన మీరు కంఫర్ట్ గా కూర్చోగలరు మంచిగా ఉండచ్చు. అలానే వాళ్ళ కమ్యూనికేషన్ ని చూడండి.

 

అలానే బాగా వింటున్నారా లేదా అనేది కూడా చూడాలి మీరు చెప్పే మాటలను వాళ్ళు వింటున్నారా లేదంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది మీరు చూడాలి మీరు మాట్లాడుతుంటే మధ్యలో వాళ్ళు మాట్లాడుతున్నారా లేకపోతే మిమ్మల్ని మాట్లాడనిస్తున్నారా అనేది కూడా మీరు అబ్సర్వ్ చేయాలి. మీ యొక్క ఆలోచనలకు విలువలకు వాళ్ళు విలువ ఇస్తున్నారా లేదా అనేది కూడా మీరు గమనించాలి. వారి యొక్క బాడీ లాంగ్వేజ్ ని కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. బాడీ లాంగ్వేజ్ ని చూసి వాళ్లు మీ పట్ల ఇంట్రెస్ట్ గా ఉన్నారా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు.

మీ పట్ల వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అనేది కూడా మీరు గమనించి తీరాలి అలానే మీరు హోటల్లో కనుక కలిశారంట అక్కడ ఉండే వెయిటర్స్ తో ఇతర మనుషులతో వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉందనేది మీరు చూడాలి. అలానే లైఫ్ లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేస్తారు అనే విషయాల గురించి తెలుసుకోవాలి అలానే లైఫ్ లో మీ జీవిత భాగస్వామి ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది వాళ్ళకి చెప్పండి. ఇలా మీరు వాళ్ళని అబ్జర్వ్ చేసి అన్ని విషయాల్ని తెలుసుకోవచ్చు మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయితేనే ఒప్పుకోండి లేకపోతే మొహమాటం లేకుండా వద్దని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version