బిగ్ షాక్‌: భారీగా ప‌రుగులు పెడుతున్న బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

నిన్న‌ భారీగా దిగొచ్చిన బంగారం ధ‌ర ఈ రోజు అంత‌కు మించి ప‌రుగులు పెడుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర భారీగా పరుగులు పెట్టింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.840 పెరిగింది. దీంతో పసిడి ధర రూ.39,270కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు ఏకంగా రూ.880 ర్యాలీ చేసింది. దీంతో ధర రూ.42,860కు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.250 పెరిగింది. దీంతో ధర రూ.51,000కు చేరింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.850 పరుగులు పెట్టింది. దీంతో ధర రూ.40,100కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.840 పెరిగింది. దీంతో ధర రూ.41,280కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.250 పైకి కదిలింది. దీంతో కేజీ వెండి ధర రూ.51,000కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version