బ్రేకింగ్‌: మ‌రో సారి పైకి క‌దిలిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

బంగారం ధర మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇక నిన్న పెరిగిన బంగారం ధర ఈ రోజు కూడా మళ్లీ పైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర శనివారం పెరిగింది. రూ.50 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.41,610 నుంచి రూ.41,660కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 పెరుగుదలతో రూ.38,150 నుంచి రూ.38,190కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి రూ.60 పైకి కదిలింది. దీంతో ధర రూ.49,000 నుంచి రూ.49,060కు పెరిగింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 పైకి కదిలింది. దీంతో ధర రూ.39,000కు చేరింది. అదే స‌మ‌యంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 పెరుగింది. దీంతో రూ.40,200కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.60 పెరుగుదలతో రూ.49,060కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version