బ్రేకింగ్; తెలంగాణాలో మొదలైన క్యాంప్ రాజకీయాలు…!

-

తెలంగాణా మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపధ్యంలో అన్న రాజకీయ పార్టీలు జాగ్రత్తలు పడుతున్నాయి. విపక్షాలను దెబ్బ కొట్టాలని తెరాస, అధికార పార్టీని దెబ్బ కొట్టాలని కాంగ్రెస్, బిజెపి సహా ఇతర పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు ఎలా అయినా సరే విజయం సాధించాలని పట్టుదలగా ఉండి పావులు కదుపుతున్నాయి.

తెరాస సంగతి ఏమో గాని కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఈ ఎన్నికలు చాలా కీలకం. ఓడిపోతే మాత్రం ఇక ఆ రెండు పార్టీలకు భవిష్యత్తు లేనట్టే అనేది అర్ధమవుతుంది. దీనితో ఇప్పుడు ఆయా పార్టీలు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. గెలుస్తారు అనుకున్న అభ్యర్ధులను ఎమ్మెల్యేలు, ఎంపీలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి ఎంపీలు అయితే అభ్యర్ధులను కాపాడుకోవడానికి క్యాంప్ లకు తరలిస్తున్నారు. ఎలా అయినా సరే పట్టు నిలుపుకోవాలని అధికార తెరాస కు అవకాశం అవకాశం ఇవ్వరాదని భావిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, అదిలాబాద్, ఖమ్మం, వరంగల్ సహా అనేక జిల్లాల్లో ఈ క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version