ఇందుకే చైనా సూపర్, రోగుల కోసం ఏం చేస్తుందో చుడండి…!

-

చైనాలో ఇప్పుడు కరోనా వైరస్ చేస్తున్న విధ్వంశం అంతా ఇంతా కాదు. గబ్బిలాలు, త్రాచు పాముల నుంచి వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు అక్కడి ప్రజలను భయపెడుతుంది అనేది అర్ధమవుతుంది. ఆ దేశం నుంచి చాలా దేశాలకు ఈ వైరస్ ఇప్పుడు వ్యాపించింది. అగ్ర రాజ్యాలు అమెరికా, రష్యాలకు కూడా ఈ వైరస్ వ్యాపించింది. దీనితో ఆయా దేశాల ప్రభుత్వాలు ఇప్పుడు దీని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే చైనా ప్రభుత్వం బాధితుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు గాను అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే ఆ దేశంలో దాదాపు వెయ్యి మందికి ఈ వ్యాధి సోకిందని సమాచారం. మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈ నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సి ప్రకటించి రోగులకు ప్రత్యేక చికిత్స అందిస్తుంది. మృతుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు అక్కడ అద్బ్భుతం చేస్తుంది చైనా ప్రభుత్వం. ఫోటోలో కనిపిస్తున్నది చీమలు కాదు.. గ్రాఫిక్స్ అంత కన్నా కాదు.. చైనాలోని ఉహన్ సిటీలో కరోన వైరస్ బాధితులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో వారి కోసం 10 రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పదులసంఖ్యలో జేసీబీలు పూర్తి స్థాయిలో పని మొదలు పెట్టాయి. అదే విధంగా సిబ్బంది నియామకం కూడా పూర్తి అయిపోయింది. ఇటువంటి అద్భుతాలకు చైనా ఎప్పుడూ నిలయమే అంటున్నారు పలువురు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version