బ్రేకింగ్‌: మ‌ళ్ళీ బంగారం ధ‌ర పైపైకే.. వెండి కూడా..

-

ఏంటో.. ఈ బంగారం ధ‌ర‌.. ఒక రోజు త‌గ్గుతుంటే.. మ‌రో రోజు భారీగా పెరిగిపోతుంది. మొన్న భారీగా పెరిగి షాక్ ఇచ్చిన బంగారం.. నిన్న కిందకి జారిపోయింది. అయితే ఈ రోజు మ‌ళ్ళీ పైపైకి క‌దిలింది. హైదరాబాద్ మార్కెట్లో ఆదివారం బంగారం ధరలు భారీగా ఎగశాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 420 రూపాయలు పెరిగింది. 24 రెట్ల బంగారం పది గ్రాములకు 42,330 నుంచి 42,750 రూపాయలకు పెరిగింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీ పెరుగుదల నమోదు చేసింది. పది గ్రాములకు 420 రూపాయలు తగ్గడంతో 38,800 నుంచి 39,220 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 370 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 41,220 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 400 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,050 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా భారీగా పెరిగింది. దాంతో వెండి ధర కేజీకి 49,990 రూపాయలుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version