నిన్న పెరుగుదల నమోదు చేసిన బంగారం, వెండి ధరలు ఈ రోజు(11.04.2020) కూడా పైపైకే కదిలాయి. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 పెరుగుదలతో రూ.43,910కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో10 గ్రాములకు రూ.40,150కు ఎగసింది. బంగారం ధరలతో పాటూ, వెండి ధరలు కూడా ఈరోజు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి 10 రూపాయలు పెరగడంతో 41,000 రూపాయల వద్దకు చేరింది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయల పెరుగుదలతో 44,260 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయల పెరుగుదలతో 42,290 రూపాయలకు చేరుకుంది. ఇక్కడ కూడా కేజీ వెండి ధర రూ.10 పెరిగింది. దీంతో ధర రూ.41,000కు చేరింది.
ఇక విజయవాడ, విశాఖపట్నం విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేవు. 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 10 రూపాయల పెరగగా… 40,150 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే పెద్దగా మార్పులు ఏమీ లేవు. 10 రూపాయలు పెరగడంతో 43,910 రూపాయలుగా ఉంది. వెండి విషయానికి వస్తే… కేజీ వెండి ధర 41,000 రూపాయలుగా ఉంది.