మొన్నటిదాక ఆకాశాన్నంటిన బంగారం ధరలు ఎట్టకేలకు దిగొచ్చాయి. వరుసగా రెండు రోజులు పాటు బంగారం ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.230 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.58,470 కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్లపై అంతే పెరగడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.53,580 కి పెరిగింది. అయితే వెండి ధర మాత్రం భారీగా పెరిగిపోయింది.
కేజీ వెండి ధర రూ.940 పెరిగిపోయింది. దీంతో ధర రూ.75,150కి చేరింది. ఢిల్లీ మార్కెట్‌లోనూ కూడా పసిడి ధర దిగొచ్చింది.. నేడు మార్కెట్‌లో రూ.250 మేర ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,350 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.54,100కి చేరింది. కేజీ వెండి ధర రూ.940 పెరుగుదలతో రూ.75,150 కు చేరింది.