ఈ ఏడాది అంతా రివర్స్ లో జరుగుతోంది. ఎందుకంటే ప్రతి ఏడాది ధంతేరస్ నాటికి బంగారం కొనుగోళ్లు బాగా పెరగుతాయి. బంగారం షాపులు కూడా మంచి మంచి ఆఫర్లు ప్రకటిస్తాయి. కానీ ఈసారి మాత్రం ఈ సీజన్ లో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. తగ్గినట్లే అనిపిస్తున్నా భారీగా పెరుగుతున్నాయి.
ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.47,870 ఉంది. నిన్నటి మీద ఈరోజు 22 క్యారెట్ల బంగారం 740 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి మీద రూ.810 పెరిగింది దీంతో ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.52,220 ఉంది. ఇక వెండి ధరలు కూడా బంగారంతో పాటే పెరిగాయి. నిన్నటి మీద వెండి ధర కేజీ రూ.600 పెరింగింది అంటే ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.62,100 ఉంది.