బంగారం ధర తగ్గింది.. వెండి ధర కొండెక్కింది..!

-

పసిడి ప్రియులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా చుక్కలు చూయిస్తున్న బంగారం ధరలు ఎట్టకేలకు దిగొచ్చాయి. భారీగా పడిపోయిన బంగారం ధర చూసి గోల్డ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే బంగారం ధర కిందకి దిగొస్తుంటే.. వెండి ధర మాత్రం పైపైకి పోతుంది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 340 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 55,320కు చేరింది.

అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర రూ. 310 తగ్గడంతో రూ. 50,700కు చేరుకుంది. అయితే వెండి ధర మాత్రం భారీగా పెరిగివయింది. కేజీ వెండి ధర రూ. 900 పైకి దూసుకెళ్లింది. దీంతో ధర రూ. 68,900కు చేరింది. మ‌రోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా త‌గ్గిపోయింది బంగారం ధర.. 0.30 శాతం ప‌డిపోయింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1992 డాలర్లకు తగ్గింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version