మహిళలకు శుభ‌వార్త‌.. దిగివ‌చ్చిన పసిడి.. ధరలు ఎలా ఉన్నాయంటే..?

-

బంగారం ధర వెలవెలబోయింది. ప‌సిడి ధ‌ర‌ నేడు మళ్లీ పడిపోయింది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం బంగారం ధరలు తగ్గుతూ వచ్చినా మ‌ళ్లీ క్ర‌మ క్రమంగా పెరుగుతూ వ‌చ్చాయి. కానీ నిన్న పెరిగిన ధరలు.. తాజాగా తగ్గాయి.

కాబ‌ట్టి బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇదే మంచి అవ‌కాశమ‌ని చెప్పవ‌చ్చు. అలాగే.. బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు కూడా ఇదే రీతిలో దిగుతు వ‌స్తుంది.నేడు వెండి ధర కూడా పడిపోయింది.

ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,780గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,780 ల‌కు చేరింది. అంటే నిన్న‌టితో పోల్చితే.. తులం బంగారంపై రూ.550 మేర ధర తగ్గింది. అయితే.. దేశ‌వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉదయం ఆరు గంటల వరకు ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350గాన‌మోదైంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,780గా రికార్డు అయ్యింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000గా న‌మోదైంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 గా ఉండ‌గా..మ‌రీ 24 క్యారెట్ల ధర రూ.48,000గా ప‌లుకుతుంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 న‌మోదు కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000లు ప‌లుకుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version