అదిరే పాలసీ… రూ.125 పొదుపుతో రూ.25 లక్షలు..!

-

కస్టమర్స్ కోసం దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటి వలన కస్టమర్స్ ఎన్నో లాభాలని పొందొచ్చు. అయితే LIC మనీ బ్యాక్ పాలసీలని కూడా ఇస్తోంది. ఇది కూడా లాభదాయకంగా ఉంటుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

LIC

మనీ బ్యాక్ పాలసీలని చాలా మంది తీసుకుంటున్నారు. దీని వలన పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఈ పాలసీల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే విధంగా మెచ్యూరిటీ తర్వాత భారీ మొత్తం పొందొచ్చు. ఇక పాలసీ వివరాలని చూస్తే.. ఎల్‌ఐసీ న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ ని అందిస్తోంది. డబ్బులని నాలుగు విడతల్లో తీసుకొచ్చు. అయితే పిల్లల వయస్సు బట్టి పాలసీ టర్మ్ మారుతుంది. 12 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లలకే ఈ పాలసీ అందుబాటులో ఉంది.

ఈ పాలసీ టర్మ్ వచ్చేసి 25 ఏళ్లు. ఏడాదిలో వయసులో ఉన్న పిల్లల పేరుపై పాలసీ తీసుకుంటే పాలసీ టర్మ్ 24 ఏళ్లు అవుతుంది. అదే ఐదేళ్ల వయసులో ఉన్న పిల్లలకు కనుక తీసుకుంటే అప్పుడు ఇరవై అవుతుంది. ఉదాహరణకి మీరు పిల్లలు పుట్టిన తొలి ఏడాదిలో మీరు రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకున్నారని అనుకుంటే నెలకు రూ.3700 వరకు ప్రీమియం చెల్లించాలి. అంటే రోజు రూ.125 ఆదా చేస్తే చాలు. 18 ఏళ్లు వచ్చిన తర్వాత రూ.2 లక్షలు ఇస్తారు. 20 ఏళ్లు వచ్చినప్పుడు మరో రూ.2 లక్షలు, 22 ఏళ్లు వచ్చినప్పుడు మరో రూ.2 లక్షలు చెల్లిస్తారు. ఇక 25 ఏళ్లు వచ్చిన తర్వాత రూ.19 లక్షలు ఇస్తారు. ఇలా మొత్తంగా రూ.25 లక్షలు మీరు తీసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version