మళ్ళీ తగ్గిన గోల్డ్ రేట్.. వరుసగా ఐదో రోజు కూడా !

-

గత కొద్ది రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు కూడా భారీగా తగ్గాయి. ఇక మన దేశంలో బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా భారీగా తగ్గింది. నిజానికి గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా ఐదో రోజు కావడం గమనార్హం. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా తగ్గుతూ పోతోంది.

ఈరోజు కూడా అలాగే రెండు ధరలూ తగ్గాయి. హైదరాబాద్‌ సహా విశాఖ పట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నిన్నటి మీద రూ.100 క్షీణించింది. దీంతో ₹51,240కు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గుదలతో ₹46,900కు దిగింది. ఇక నిన్న ఒక్కరోజే కేజీ వెండి ధర 200 రూపాయల దాకా తగ్గింది. దీంతో వెండి ధర ₹66,500కు చేరుకుంది.

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version