నిన్న ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం వేర్వేరుగా లేఖలు రాశారన్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనే నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కి లేఖల ద్వారా సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే యూపీఎస్‌సీ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్‌బీఐ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షలు హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో మాత్రమే నిర్వహిస్తుండటం వల్ల ఇంగ్లీష్ మీడియంలో చదువుకోని వారు తీవ్రంగా నష్టపోతున్నారని, కేసీఆర్ లేఖ ద్వారా కోరారు. ఇక ఈ లేఖకకు సంబంధించి ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉద్యోగ నియామకాల కోసం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిందని, 12 ప్రాంతీయ భాషల్లో నియామక పరీక్షలు ఉంటాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కి NRA CET విషయం తెలిసినట్టు లేదని ఆయన ఎద్దేవా చేశారు.
Looks like Hon @TelanganaCMO is not aware of the NRA-CET.
A distinguished agency setup by Hon PM @narendramodi the National Recruitment Agency will conduct CET for recruitment to Central govt Jobs in 12 Indian languages.
Hon CM, for your reference- https://t.co/XMZMyvWQa2 https://t.co/3Uk1uh06An— G Kishan Reddy (@kishanreddybjp) November 20, 2020