వరుసగా రెండు రోజు బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి రెండో రోజు బంగారం భారీగా తగ్గుదల నమోదు చేసింది. కరోనా ప్రభావం, డిమాండ్ తగ్గడం తో బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధర హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం భారీగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.520 తగ్గడంతో రూ.45,180కు దిగి వచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.520 తగ్గడంతో రూ.41,320కు పడిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ.43,400కు పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గుదలతో రూ.42,200కు దిగి వచ్చింది. కేజీ వెండి ధర రూ.100 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.48,400కు దిగి వచ్చింది. విజయవాడ, వైజాగ్ మార్కెట్ లో కూడా బంగారం ధర తగ్గింది. అయితే కొనుగోలు చేసే వారికి ఇది మంచి తరుణం అంటున్నారు నిపుణులు.