బంగారం వినియోగంలో మన దేశం రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. మన దేశంలో స్త్రీలకు బంగారం మీద మక్కువ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. రూపాయి రూపాయి దాచుకుని బంగార౦ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీనితో బంగారం ధరలు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలి అంటే సామాన్యుడికి బంగారం అందుబాటులో లేదు.
దీనితో ఇప్పుడు బంగారం కోనోగోలు అందే క్రమంగా తగ్గుతున్నట్టు తెలుస్తంది. జనవరి మాసంలో 10 గ్రాముల బంగారం రికార్డు స్థాయిలో రూ.41,293కు చేరింది. గత ఏడాది జనవరి మాసంలో భారత్ 69.51 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా…ఈ ఏడాది జనవరి మాసంలో కేవలం 36.26 టన్నుల బంగారం మాత్రమే దిగుతుమతి అయింది అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
గతంలో సామాన్యులు బంగారం ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే వారు. అయితే అనూహ్యంగా ధరలు ఊహించని విధంగా పెరిగిపోవడంతో కొనుగోలు చెయ్యాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. గత ఏడాది జనవరి మాసంతో పోలిస్తే పోలిస్తే 48 శాతం తగ్గాయని అంటున్నారు. కరోనా ప్రభావం దెబ్బ బంగారం మీద పడే అవకాశాలు కనపడుతున్నాయి.
2018 సంవత్సరంతో పోలిస్తే 2019లో బంగారం వినియోగం 9 శాతం తగ్గినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గత వారం తన నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే. బంగారం దిగుమతులు ఫిబ్రవరి మాసంలోనూ 40 టన్నులకు దిగువునే ఉండే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. 2019 ఫిబ్రవరి మాసంలో 77.64 టన్నుల దిగుమతి చేసుకున్నారు. పసిడి ధరలు దిగివస్తాయన్న నమ్మకం సామాన్యుల్లో ఉందని అంటున్నారు.