Gold-Silver Price: ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌.. బంగారం ధరలు వెల‌వెల‌..

-

Gold-Silver Price: బంగారానికి ఉన్న డిమాండ్ ను ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల్సిన అవ‌సరం లేదు. మ‌న దేశంలో అయితే.. మ‌రీ ఎక్కువ‌. ఏ చిన్న సందర్భమైనా బంగారం, వెండి కొనుగోలు చేయ‌డానికి ఆసక్తిని చూపుతారు. వివిధ రూపాయల్లో బంగారంపై పెట్టుబడి పెట్టాల‌ని భావిస్తారు. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఓ శుభ‌వార్త‌. గ‌త వారంలో ఆకాశాన్ని తాకినా బంగారం ధ‌ర‌లు..  నేడు వెలవెలబోయింది. పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. ఇలా బంగారం ధర దిగి వస్తే.. వెండి రేటు మాత్రం పైపైకి పోతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా వెండి ధ‌ర‌ల్లో హెచ్చు క‌నిపించింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 దిగింది. దీంతో బంగారం ధర రూ.47,130కు చేరింది. అదేస‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,200గా ప‌లుకుతుంది. ఓ వైపు బంగారం ధ‌ర‌లు నేల చూపులు చూస్తుంటే.. వెండి ధ‌ర‌లు మాత్రం పైకి కదులు తున్నాయి. నిన్న కంటే రూ.300 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.64,700కు చేరింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.20 శాతం త‌గ్గింది. దీంతో బంగారం రేటు ఔన్స్‌కు 1733 డాలర్లకు క్షీణించింది. వెండి రేటు మాత్రం పైకి కదిలింది. ఔన్స్‌కు 0.01 శాతం
పెర‌గ‌డంతో 22.46 డాలర్లకు చేరింది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480 లుగా ప‌లుకుతుంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,040 లుగా ప‌లుకుతుంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 లుగా ప‌లుకుతుంది. .

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 లుగా ప‌లుకుతుంది. .

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 లుగా ప‌లుకుతుంది.

అయితే.. బంగారం ధ‌ర‌ల‌పై ప్ర‌భావం చూపే అంశాలు అనేకం. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, ఫెడ్ రిజర్వ్ ప్రకటన, ప్ర‌పంచ‌వ్యాపంగా కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం వంటి అంశాలు బంగారం పైన ప్రభావం చూపాయి. బంగారం ధరలు వచ్చే వారం కూడా పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news