చట్నీ పార్టీ రాబోతుంది…ఆనందయ్య పార్టీపై గోగినేని ..!

-

మాజీ బిగ్ బాస్ కాంటెస్ట్టెంట్ , నాస్తికుడు బాబు గోగినేని ముందు నుండి అనందయ్య కరోనా మందును వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అది మందు కాదని చట్నీ అని బాబు గొనినేని అనేక ఇంటర్వ్యూ లలో చెప్పాడు. ఇక తాజాగా నిన్న ఆనందయ్య పొలిటికల్ పార్టీ పెడతా అంటూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా యాదవులకు, బీసీలకోసం ఈ పార్టీ స్థాపించ బోతున్నట్టు తెలుస్తోంది. కాగా దానిపై గోగినేని తన స్టైల్ లో స్పందించాడు.

“చట్నీ పార్టీ రాబుతుంది. కాబట్టి గత ఐదు నెలలలో జరిగిన కలెక్షన్ ట్రస్ట్ చట్ట ఉల్లంఘనలను ఇతర విషయాల నుండి ఆరాలు ఒక స్పీడ్ అందుకుంటాయి. ఇప్పటికే చాలా సమాచారం ఉంది మంచిదే” అంటూ గోగినేని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అనందయ్య పొలిటికల్ పార్టీ ఏపిలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఉన్న పార్టీ లతో ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటాయి. ఇక అనందయ్య ఎంట్రీ తో మరింత హాట్ హాట్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news