ఏపీలోని కృష్ణా జిల్లాలో గల పలు రైతు సేవా కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి రికార్డుల్లో తక్కువ చూపించడంపై సీరియస్ అయ్యారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు అందుకు బాధ్యులైన ఇద్దరు కస్టోడియల్ ఆఫీసర్లు, టీఏను అధికారులు సస్పెండ్ చేశారు. ఇకమీదట ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
రైతుల పట్ల ఎవరైనా మోసపూరిత వైఖరి కనబరిచినా అస్సలు సహించబోమన్నారు. ఇదిలాఉండగా రాష్ట్రంలోని రైతు సేవా కేంద్రాల్లో ఫ్రాడింగ్ జరుగుతుందని సీఎంకు సమాచారం అందడంతో ఆయన వీటిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులను అడిగి రిపోర్టులు సైతం తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.